ఆయన ఇంటికి కరెంట్‌ కట్‌ చేయాలన్న కేసీఆర్‌

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.ఈ సందర్బంగా గవర్నర్‌ ప్రశంగించారు.

ఇక కాంగ్రెస్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌ కారణంగా భూ గర్బ జలాలు అన్ని కూడా అడుగంటి పోయాయి అన్నాడు.

Telangana Cm Kcr Satire On Komati Reddy Raja Gopal Reddy-ఆయన ఇంటి

అందుకే కరెంట్‌ కోతలు కావాలంటూ ఆయన డిమాండ్‌ చేశాడు.రాజగోపాల్‌ రెడ్డి మాటలపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

రాష్ట్రంలో కొనసాగుతున్న 24 గంటల కరెంట్‌కు దేశ వ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి.రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

Advertisement

ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ వారు ఇలాంటి పిచ్చి ప్రసంగాలు చేయడం ఏంటీ అన్నాడు.రేపటి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి కరెంట్‌ కట్‌ చేయాలని కామెంట్‌ చేశాడు.

అప్పుడు కరెంట్‌ విలువ ఏంటో ఆయనకు తెలుస్తుందని ఈ సందర్బంగా అన్నాడు.

Advertisement

తాజా వార్తలు