Telangana cabinet meeting : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ కేబినెట్ సమావేశం( Telangana cabinet meeting ) ఇవాళ జరగనుంది.

ఈ మేరకు సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన మంత్రులు అంతా భేటీ కానున్నారు.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారని తెలుస్తోంది.

దాంతోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారని సమాచారం.రైతుబంధు( Rythu Bandhu ) పేరును రైతు భరోసాగా మార్చడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక నిబంధనలపైనా చర్చించనున్నారు.

అలాగే మహిళలకు వడ్డీలేని రుణ పథకం ప్రారంభంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.ఇందులో భాగంగా హైదరాబాద్ లో భారీ మహిళా సదస్సును ప్రభుత్వం నిర్వహించనుంది.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు