సంజయ్ పాదయాత్ర మళ్లీ వాయిదా ?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పదవి చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణ అంతటా పర్యటించి తన పట్టు పెంచుకోవాలి అని చూస్తున్నారు.

ఈ మేరకు ఈ నెల ఈనెల తొమ్మిదో తేదీన పాదయాత్ర చేపట్టేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే అనూహ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడంతో, సంజయ్ తన యాత్రను 24వ తేదీకి వాయిదా వేసుకున్నారు.ఈ మేరకు పాదయాత్ర రూట్ మ్యాప్ తో సహా అన్ని సిద్ధం చేసుకున్నారు.

దీని కోసం ప్రత్యేకంగా కొన్ని కమిటీలను నియమించారు.ఇక 24వ తేదీన యాత్ర ప్రారంభించేందుకు సర్వం సిద్దం చేసుకోగా ఆకస్మాత్తుగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మృతిచెందడంతో పాదయాత్ర వాయిదా పడింది.

దీనికి గౌరవసూచకంగా బీజేపీ సంతాప దినాలు ప్రకటించడంతో ఆ సంతాపదినాలు సమయంలో సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టడం సరికాదనే ఉద్దేశంతో సంజయ్ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.అయితే తిరిగి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది ఇంకా స్పష్టత లేదు.

Advertisement

పార్టీ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ నెల 30వ తేదీ నుంచి  ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సంజయ్ తన పాదయాత్ర కోసం భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ మేరకు పాదయాత్ర కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా 30 కమిటీ లను సంజయ్ నియమించారు.పాదయాత్ర ఈ సందర్భంగా ఇప్పటికే భారీ ఫ్లెక్సీలు తో సంజయ్ పాదయాత్ర చేపట్టే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

అయితే ఇప్పుడు మరో సారి పాద యాత్ర వాయిదా పడిందనే సమాచారంతో పార్టీ కేడర్ లో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.ఇప్పటికే సంజయ్,  కిషన్ రెడ్డి రెండు వర్గాలుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.సంజయ్ పాదయాత్ర జరగకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో, కిషన్ రెడ్డి తన యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో సంజయ్ తన పాదయాత్రను ఇప్పటికే వాయిదా వేసుకున్నారు.

ఇక ఇప్పుడు కళ్యాణ్ సింగ్ మరణంతో దీనిని వాయిదా వేసుకోవాల్సి రావడం తో పాదయాత్ర పై సంజయ్ లోనూ నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు