' హైడ్రా ' కూల్చివేతలపై తలోమాట .. బీజేపీ లో గందరగోళం

గత కొద్దిరోజులుగా తెలంగాణలో హైడ్రా( Hydra ) పేరు మారుమోగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా చెరువులు ,కొండలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శిస్తుండడం రాజకీయంగానూ సంచలనంగా మారింది .

కూల్చివేతలలో ఎక్కువగా  రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన భవనాలు నిర్మాణాలు ఉండడంతో,  ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.  హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు , కొండల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా రంగంలోకి దిగింది.

  ఎఫ్డిఎల్,  బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది.ఈ కూల్చివేతల పరంపర ఇంకా కొనసాగుతూ ఉండడంతో అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

హైడ్రా కూల్చివేతలకు ప్రజల నుంచి,  వివిధ రాజకీయ నేతల నుంచి పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుంది.అయితే ఈ విషయంలో బిజెపిలో( BJP ) మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది.

Advertisement

హైడ్రా కూల్చివేతలను సమర్థించాలా లేక వ్యతిరేకించాలా అనే విషయంలో ఏ క్లారిటీ తెలంగాణ బిజెపి అధిష్టానం నుంచి రాకపోవడంతో ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.

కొంతమంది నేతలు హైడ్రా కూల్చివేతలను బహిరంగంగానే సమర్థిస్తూ ఉండగా,  మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.దీంతో అసలు తెలంగాణ బిజెపి వైఖరి ఈ విషయంలో ఏమిటనేది ఎవరికి అంతు పట్టడం లేదు.తెలంగాణ బిజెపిలో 8 మంది ఎమ్మెల్యేలు,  ఎంపీలు 8 మంది ఉన్నారు.

వీరికి ఏ విషయంలో ఏ విధంగా స్పందించాలనే దానిపై బిజెపి అధిష్టానం ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో,  సొంతంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.దీంతో బిజెపి వైకిరి ఏమిటనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ,( Kishan Reddy ) ఈటెల రాజేందర్( Etela Rajendar ) హైడ్రా నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు.బడా బాబుల కట్టడాలను కూల్చడం సంతోషమేనని,  కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని, రేవంత్ హీరోలాగా ఫోజులు కొట్టే పద్ధతి మంచిది కాదు అని విమర్శలు చేస్తున్నారు.

కాపాడాల్సిన నాన్నే వేధింపులకు పాల్పడ్డాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు వైరల్!
వైసీపీలో ప్రకంపనలు .. రాజీనామా దిశగా రాజ్యసభ ఎంపీలు ? 

అసలు ఆ నిర్మాణాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు.ఇక  ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , రఘునందన్ రావులు బహిరంగంగానే ఈ కూల్చివేతలను సమర్థిస్తున్నారు.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాధవి లత వంటి వారు సమర్థిస్తున్నారు ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూడా కూల్చాలంటూ మాధవి లత డిమాండ్ చేస్తున్నారు .బి జె ఎల్ పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,  ఎమ్మెల్యే తాటిపల్లి కూల్చివేతలను సమర్థిస్తూనే,  సామాన్యులను ఇబ్బంది పెట్ట వద్దు అంటూ సూచిస్తున్నారు.ఈ విధంగా ఎవరికి వారు హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ ఉండడంతో,  తెలంగాణ బిజెపి నేతలకు సరైన దిశ నిర్దేశం చేసే విషయంలో బిజెపి అధిష్టానం విఫలమైందని , దాని కారణంగానే తెలంగాణలో బిజెపి వెనుకబడుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు