చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్.. AIతో టీచర్ చేసిన పనికి ప్రపంచం మొత్తం ఫిదా!

ఈ రోజుల్లో AI అంటే ఏదో భయంకరమైనది, ఉద్యోగాలు తీసేసేది అనుకుంటున్నారు చాలామంది.

కానీ చైనాలో( China ) ఒక టీచర్( Teacher ) మాత్రం AI టెక్నాలజీతో అద్భుతం చేశారు.

ఒక వైరల్ వీడియోలో,( Viral Video ) ఆ టీచర్ తన స్టూడెంట్స్ కోసం ఒక స్పెషల్ స్లైడ్‌షో క్రియేట్ చేశారు.హాల్ మొత్తం పిల్లలు, వాళ్ల కళ్లల్లో ఎంతో క్యూరియాసిటీ నెలకొన్నది.

స్లైడ్‌షో స్టూడెంట్స్ డ్రీమ్ కెరీర్స్‌లో( Students Dream Careers ) వాళ్లు ఎలా ఉంటారో AI టెక్నాలజీతో ఫొటోలు క్రియేట్ చేసి చూపించారు ఆ టీచర్.అంతే, స్టూడెంట్స్ ఒక్కసారిగా అరిచారు, కేరింతలు కొట్టారు.

సైంటిస్టులు, డాక్టర్లు, ఆస్ట్రోనాట్లు. ఇలా ఎవరికి ఏది ఇష్టమో వాళ్లని ఆ రూపంలో చూసుకుని తెగ మురిసిపోయారు.

Advertisement

హాల్ మొత్తం ఒక్కసారిగా ఆనందం, మోటివేషన్‌తో( Motivation ) నిండిపోయింది.పిల్లలు కనే కలల్ని కళ్లముందు నిజం చేశారు ఆ టీచర్.

ఈ వీడియోని మొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.అది ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.జస్ట్ 5 రోజుల్లోనే 35 లక్షల వ్యూస్ దాటేసింది.

టీచర్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.AIని ఇంత పాజిటివ్‌గా వాడొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ "AIని ఇలాంటి మంచి పనుల కోసం వాడాలి.నెక్స్ట్ జనరేషన్‌కి ఇన్‌స్పిరేషన్ ఇవ్వడానికి వాడాలి కానీ, వాళ్ల ఉద్యోగాలు లాక్కోవడానికి కాదు" అని అన్నారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఇంకొకరు "చిన్నప్పుడు మిమ్మల్ని మీ డ్రీమ్ జాబ్‌లో చూసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఇది స్వచ్ఛమైన మోటివేషన్.

Advertisement

" అని కామెంట్ చేశారు.

చాలామంది ఎమోషనల్ కామెంట్స్ కూడా పెట్టారు."నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మా టీచర్లు ఇలాంటివి చేసి ఉంటే ఎంత బాగుండేది.ఈ పిల్లలు నిజంగా లక్కీ" అని ఒకరు అంటే, ఇంకొకరు "ఒక్కసారైనా AI డీప్‌ఫేక్‌లను లేదా గందరగోళాన్ని సృష్టించడం లేదు.

బదులుగా, ఇది పిల్లలకు ఆశను ఇస్తోంది.టీచర్‌కి హ్యాట్సాఫ్." అని కామెంట్ చేశారు.

టీచర్ మంచి ఉద్దేశాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు."టెక్నాలజీ ముఖ్యం, కానీ దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామనేది మరింత ముఖ్యం.

ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది" అని ఒకరు అంటే, "పిల్లలకు ఏ కల కూడా పెద్దది కాదని చూపించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.ఈ పాఠాన్ని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

తాజా వార్తలు