క‌డ‌ప‌లో బ‌క‌రా అయిన టీడీపీ ప్లాన్‌

జ‌గ‌న్ సొంత జిల్లా కడ‌ప గ‌డిచిన కొన్ని ద‌శాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి న‌మ్మిన‌బంటు మాదిరిగా ఉంది.అభివృద్దితో ప‌నిలేకుండా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.

వైఎస్ కుటుంబం వెంటే ఈ జిల్లా ఓట‌ర్లు న‌డుస్తున్నారు.ఇప్పుడు కూడా అదే జ‌రిగింది.2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ వైకాపాకే క‌డ‌ప ఓట‌ర్లు మొగ్గు చూపారు.అయితే, అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం.

TDP Plan Flop In Kadapa-TDP Plan Flop In Kadapa-Telugu Political News-Telugu Tol

జ‌గ‌న్ ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తున్నారు.ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కి దిమ్మ‌తిరిగేలా చేయాల‌ని ప్లాన్ వేశారు.

దీనిలో భాగంగా.క‌డ‌పలో జ‌గ‌న్ పార్టీకి చెందిన నేత‌ల‌ను ఒక్క‌రొక్క‌రుగా త‌న పార్టీలోకి లాగేసుకుని సైకిల్ ఎక్కించేసుకున్నారు.

Advertisement

ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహితులైన వాళ్లు కూడా చంద్ర‌బాబు పంచ‌కు చేరిపోయారు.ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను సైతం ఓడించి తీరుతామ‌ని దేవినేని ఉమా వంటి వాళ్లు కామెంట్లు కుమ్మ‌రించేశారు.

దీంతో అంద‌రూ బ‌హుశ అదే జ‌రుగుతుంద‌ని భావించారు.కానీ, అనూహ్యంగా ఇప్పుడు మారుతున్న ఈక్వేష‌న్స్ ను బ‌ట్టి ప‌రిశీస్తే.

టీడీపీ కండువా క‌ప్పుకొన్న వైకాపా నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా తిరిగి జ‌గ‌న్ గూటిగే రావాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం.ఈ ప‌రిణామం టీడీపీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న రేకెత్తిస్తుండ‌గా.

వైకాపాలో మాత్రం హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.ఇటీవ‌ల వైకాపా నుంచి కడప నగరపాలక సంస్థలోని 12 మంది కార్పొరేటర్లు విడతల వారీగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల సమక్షంలో పసుపు కండువా వేసుకున్నారు.

అయితే వారిలో ఇద్దరు ముగ్గురు కొన్ని రోజులకే సొంత గూటికి వెళ్లారు.ప్రస్తుతం మరో ఐదారుమంది ఆదే బాటలో పయనిస్తూ ఇడుపుల పాయలో జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

వీరంతా టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోతున్న‌ట్టు స‌మాచారం.ఏదేమైనా జ‌గ‌న్ కంచుకోట‌లో టీడీపీ ప్లాన్ కామెడీ అయ్యింది.

తాజా వార్తలు