మూర్ఖత్వానికి ప్రతిరూపం జగన్ అంటున్న లోకేష్ బాబు

మూర్ఖత్వానికి ప్రతిరూపం ఏపీ సీఎం జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ధ్వజమెత్తారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని,వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నప్పటికీ కూడా సీఎం గారిలో మాత్రం మూర్ఖత్వం తగ్గడం లేదని, ఇన్ని కేసులు పెరిగిపోతున్నా కూడా ఆయన మాత్రం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మాత్రం ధరించడం లేదు అంటూ లోకేష్ బాబు మండిపడ్డారు.

మూర్ఖత్వానికి మానవ ప్రతిరూపంగా జగన్ మిగిలిపోయారని ఆయన మాస్కు పెట్టుకోరు, వేరే వాళ్లను పెట్టుకోనివ్వరు అని ఆరోపించారు.ట్విట్టర్ ద్వారా జగన్ పై నిప్పులు చెరిగిన లోకేష్ ఈ క్రమంలో ఓ వీడియో కూడా పంచుకున్నారు.

TDP MLC Nara Lokesh Questions CM Jagan For Not Wearing Mask, TDP MLC Nara Lokesh

అంతేకాకుండా చీరాల యువకుడు కిరణ్ మృతి ఉదంతాన్ని ప్రస్తావించిన ఆయన సీఎం గారే మాస్క్ పెట్టుకోనప్పుడు దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపడం ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు.అసలు పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని చంపింది మాస్కు వేసుకోలేదనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు