రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు..!

ఏపీలోని రాజమహేంద్రవరం పసుపుమయంగా మారింది.ఈ క్రమంలో మహానాడులో భాగంగా టీడీపీ ప్రతినిధుల సభ ప్రారంభమైంది.

ప్రతినిధుల సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది ప్రతినిధులతో పాటు 40 వేల మంది కార్యకర్తలు హాజరు అయ్యారు.ఈ ప్రతినిధుల సభలో నాలుగు అంశాలపై తీర్మానం చేయనున్నారు.

కాగా పార్టీ అధినేత చంద్రబాబు సభా ప్రాంగణానికి మరి కాసేపటిలో చేరుకోనున్నారు.మహానాడు నుంచి ఏపీలో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ మోగించనుంది.

ఈ క్రమంలోనే పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 21 తీర్మానాలు చేయనుంది.

Advertisement

ఇందులో ఏపీకి సంబంధించి 15 తీర్మానాలుండగా తెలంగాణకు సంబంధించి ఆరు తీర్మానాలు ఉండనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు