వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి ఫైర్

రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.పథకాల్లో నిబంధనలు పెట్టి రైతులకు అందకుండా చేస్తున్నారన్నారు.

ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించే పథకాన్ని ఎత్తేశారని విమర్శించారు.రైతులను ఆదుకుంటామనడం తప్ప ఆదుకున్న దాఖలాలు లేవని చెప్పారు.

కరువును కూడా సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.నష్టపోయిన రైతులను పరామర్శించే దమ్ము జగన్ కు లేదని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని వెల్లడించారు.ఈ -క్రాప్ విధానంలో చాలా అవకతవకలు జరిగాయని తెలిపారు.

Advertisement

అసలైన రైతుల పేర్లు ఈ-క్రాప్ లో నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement