ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారంలోకి రావాలని వైసిపి కలలు కంటుంది - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

చేతకాని, గాజులు వేసుకున్న వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారం లోకి రావాలని కలలు కంటుందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.

గత నెల ఐదో తేదీన భీమవరంలో యువగళం పాదయాత్రలో జరిగిన గొడవపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు కావడంతో ఈ కేసు కు సంబంధించి ముందస్తు బెయిల్ తీసుకున్న ప్రభాకర్ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన తరువాత మీడియాతో మాట్లాడారు అనారోగ్యంతో పాదయాత్రలో కూడా పాల్గొనని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పై కూడా కేసు నమోదు చేయడం దారుణమన్నారు.

జరిగిన ఘటనకి తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా తమపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని ప్రభాకర్ ఆరోపించారు.

Tdp Leader Chintamaneni Prabhakar Fires On Ycp, Tdp , Chintamaneni Prabhakar , Y
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి12, బుధవారం 2025

తాజా వార్తలు