Vijayasai Reddy Buddha Venkanna: విజయసాయిరెడ్డికి నార్కో టెస్టు జరపాలి - టీడీపీ నేత బుద్దా వెంకన్న

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లా పర్యటన విజయవంతం కావడంతో వైసీపీకి భయం పట్టుకుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.

ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై వైసీపీ దాడులు చేస్తుంటే ఏపీ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కేంద్రానికి నివేదికలు ఎందుకు పంపడం లేదని నిలదీశారు.జగన్ సీఎం అయ్యాక రాష్ట్రానికి అరిష్టం పట్టిందన్నారు.

చంద్రబాబుపై దాడులు జరిగితే పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ఇకపై టీడీపీ నేతలపై దాడులు చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయమన్నారు.

Tdp Leader Buddha Venkanna Shocking Comments On Ycp Mp Vijayasai Reddy Details,

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి క్యాసినోతో సంబంధాలు ఉన్నాయని.క్యాసినో ఆడకపోతే చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్‌లో సాయిరెడ్డికి ఏం పని అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

ఈడీ వెంటనే సాయిరెడ్డికి నార్కో టెస్టు జరపాలన్నారు.విజయసాయి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.

భవిష్యత్తులో తగిన విధంగా బుద్ది చెబుతామన్నారు.ప్రజల కోసం పని‌ చేసే చంద్రబాబుపై నీచంగా విమర్శలు చేస్తావా? అంటూ మండిపడ్డారు.ఒక అమ్మకు, అబ్బకు పుట్టినోడే సక్రమంగా మాట్లాడతాడని అన్నారు.

రాజకీయంగా విమర్శలు చేయాలే కానీ బూతులు ఏంట్రా గుంట నక్క అంటూ విరుచుకుపడ్డారు.ఉత్తరాంధ్ర మొత్తం దోచేశారని.

సాయిరెడ్డిపై కథలు కథలుగా చెబుతున్నారని, విజయసాయి వల్లే టీడీపీకి 34 సీట్లలో విజయం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

తాజా వార్తలు