టీడీపి నేతకు త్వరలో చుట్టుకోనున్న సరికొత్త కుంభకోణం.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్నికల ముందు వైసీపీ టీడీపీ నేతల పై ఆరోపించిన కుంభకోణాలను, దారుణాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది.

అందులో భాగంగానే ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు,మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసిపి నేత మోకా భాస్కరరావు హత్యకేసు,ఫోర్జరీ, నకిలీ పత్రాలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా యనమల, అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్ వంటివారు కూడా ప్రస్తుతం కేసులను ఎదుర్కొంటున్నారు.తాజాగా ఈ లిస్ట్ లోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు.

CBI Enquiry Against TDP Leader Yarapathineni Srinivas In Illegal Mining Scam, Il

ఆయనే యరపతినేని శ్రీనివాస్ ఈయన అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు సిఐడి నివేదిక ద్వారా బయటపడింది.ఈ కేసులో ప్రత్యక్ష,పరోక్ష పాత్రలను పోషించిన మొత్తం 16 మందిపైన 18 కేసులు నమోదయ్యాయి.

తాజాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ సమగ్రంగా విచారించడానికి ఈ కేసును సీబీఐకు అప్పజెప్పినట్లు తెలుస్తుంది.

Advertisement

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు ప్రతిపక్ష టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.వరుసగా టీడీపీ బడా నాయకులంతా ఇలా కేసులో చిక్కుకోవడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

కావాలనే వైసీపీ ప్రభుత్వం తమ నాయకుల పై కక్ష సాధిస్తుందని టీడీపీ నేతలు ఓ పక్క ఆరోపిస్తున్నారు.మరోపక్క చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది అని వైసీపీ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు మరి ఇందులో ఎవరి ధోరణి నిజమనేది ప్రజలే తేల్చాలి.

Advertisement

తాజా వార్తలు