వైసీపీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులేనట.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు.. ??

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం టీడీపీ.వైసీపీ చుట్టే తిరుగుతున్నాయట.

ఈ ఇరుపార్టీ నేతలు చేసుకుంటున్న విమర్శలు చూస్తుంటే తమకు అధికారం దక్కనివ్వలేదని కడుపు మండుతున్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందట.

ఇకపోతే వైసీపీ పై టీడీపీ నేత బోండా ఉమ మండిపడుతున్నారు.

Tdp Leader Bonda Uma Commented On Ycpap, TDP Leader, Bonda Uma, Commented, Ycp,

వైసీపీకి రాజ్యాంగం పై గౌరవం లేదని, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్న వైసీపీ నేతల తీరు పై అసంతృప్తిని వెల్లడించారు.ఇక ఒక రాష్ట్రానికి మంత్రి స్దానంలో ఉన్న కొడాలి నాని, నిమ్మగడ్డ వస్తే ఏమి పీకుతాడని బూతులు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్దారు.

ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ నోటిఫికేషన్ ను అమలు చేస్తున్నారని తన పని తాను చేసుకుంటున్న ఒక అధికారిని పట్టుకుని ఇలా అభాసుపాలు చేయడం సరి కాదని హితవు పలికాడు.ఏపీలో పోలీసు వ్యవస్దను వైసీపీ నాయకులే కంట్రోల్ చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులే కాబట్టి వైసీపీ నేతలు చెప్పారని చేస్తే అధికారులు ఇబ్బందులు పడక తప్పదని బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ - 20

తాజా వార్తలు