TDP: వారికి టికెట్ల ఇవ్వలేం .. గేట్లు మూసేయబోతున్న టీడీపీ ?

ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వలసలు విషయం లో కీలక నిర్ణయం తీసుకుంది.

రాబోయే సార్వత్రికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ( YCP ) అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన జగన్( Jagan ) ఇప్పటికే ఆరు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు.ఆ జాబితాలో జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ కీలక నేతలకు ఎంతోమందికి జగన్ మొండి చూపించారు.

దీంతో టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు అంతా టిడిపిలోకి వలస వస్తుండడంతో, ఇటీవల కాలంలో భారీగా చేరికలు కనిపించాయి.ఇక వైసిపి నుంచి పెద్ద ఎత్తున నాయకులు టిడిపిలోకి వచ్చి చేరే అవకాశం ఉండడంతో , ఈ చేరికల విషయంలో మొదట్లో సంతోషం వ్యక్తం అయినా,  కొత్తగా వచ్చి చేరిన నేతలతో టిడిపికి కొత్త తలనొప్పులు తలెత్తుతుండడం వంటివి వచ్చే ఎన్నికల్లో తమకు ఇబ్బందికరంగా మారుతాయి అనే విషయాన్ని గ్రహించిన టిడిపి అధినేత చంద్రబాబు( chandrababu ) చేరికలకు పులి స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చి చేరే నేతలు ఎక్కువమంది టికెట్ ఆశించి వచ్చి చేరుతున్నారు.దీంతో ఇప్పటివరకు టిడిపిలో కీలకంగా పనిచేస్తూ నియోజకవర్గ టికెట్ తమదే అన్న ఆశతో ఉన్న నేతల్లో అసంతృప్తి చెలరేగడం, కొత్తగా వచ్చి చేరుతున్న నేతలను  కలుపుకుని వెళ్లేందుకు ఇష్టపడక పోవడం వంటివన్నీ లెక్కలు వేసుకుంటున్న బాబు ఇతర పార్టీల  నుంచి టికెట్ ఆశించి వచ్చి చేరే నేతలతో కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న అభిప్రాయంతో ఉన్న చంద్ర బాబు అటువంటి నేతల చేరికలకు రెడ్ సిగ్నల్ వేయాలనే ఆలోచనకు వచ్చారట.తాజాగా ఉండవల్లి( undavalli ) లో పార్టీ కీలక నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట.

Advertisement

ఇప్పటివరకు తనకు టచ్ లోకి చాలామంది కీలక నేతలే వచ్చారని,  అయితే వారి గ్రాఫ్ , ప్రజలలో వారికి ఉన్న సానుభూతి,  గెలుపు అవకాశాలు అన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు.అసలు టిడిపిలోకి వారు ఎందుకు వస్తున్నారు ?  వారు ఏం ఆశిస్తున్నారో ముందుగానే తెలుసుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని , చాలామంది టికెట్లు ఆశించి వస్తున్నారని, వచ్చిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోలేనంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం తో టిడిపిలో చేరాలనుకున్న నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారట.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు