సర్వేలపై నో కాన్ఫిడెన్స్.. టీడీపీ నమ్మకం ఏంటి ?

ఏపీలో జరిగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఆ పార్టీకి చాలా కీలకం.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో టీడీపీ పనైపోయిందనే అంచనాకు వచ్చేశారు చాలమంది.

పార్టీ నేతల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంటూ వచ్చింది.ఒకవైపు చంద్రబాబుకు వయసు పైబడుతుండడం, మరోవైపు లోకేష్ రాజకీయ పరిజ్ఞానం కొరత ఉండడం, దీంతో టీడీపీ భవిష్యత్ నాయకుడు ఎవరనే దానిపై పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు ( Atchannaidu )లాంటి సీనియర్ నేత కూడా పార్టీ పనైపోయిందని అసంతృప్తి వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి.ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తేడా కొట్టిన తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి.

దాంతో ఈసారి ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈసారి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.దీంతో ఈసారి ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాగా మారాయి.

Advertisement

దాంతో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్( Nara lokesh 0 విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికలు టీడీపీలో జోష్ నింపాయి.

ఏకంగా వైసీపీ బలంగా ఉన్న మూడు స్థానాల్లో విజయం సాధించి ఒక్కసారిగా మెయిన్ లైన్ లోకి వచ్చింది.దీంతో వైసీపీ సర్కార్( YCP ) పై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందని, అది టీడీపీకి కచ్చితంగా ప్లేస్ అవుతుందని తెలుగు తమ్ముళ్ళు నమ్ముతున్నారు.అయితే ఇటీవల ఒక నేషనల్ సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏకంగా 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది.

25 ఎంపీ స్థానాలు అంటే రాష్ట్రంలో అన్నీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్లే.అదే గనుక జరిగితే టీడీపీ అంచనాలన్నీ తలకిందులు అయినట్లే.ఈ సర్వేల ఫలితాలు ఎలా ఉన్న వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ అధికారం ఖాయమని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

మరి టీడీపీ ఇంత కాన్ఫిడెంట్ గా కారణం కూడా లేకపోలేదు.వైసీపీ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది.గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్ వంటి కార్యక్రమాలతో జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోంది.

Advertisement

దాంతో ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకోవడం ఖాయమనేది టీడీపీ నేతల్లో ఉన్న ధీమా.మరి తెలుగుదేశం శ్రేణుల నమ్మకం నెరవేరుతుందా ? లేదా సర్వేల ఫలితలే నిజమౌతాయా ? అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.

తాజా వార్తలు