టీడీపీ త్యాగం చేయాల్సిందే ... పవన్ ' లెక్క ' ఇదే ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కూడా ఎన్నికల వ్యూహాల్లో బాగా ఆరితేరిపోయారు.

టిడిపి తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చే అరకొర సీట్లతో సరిపెట్టుకునేందుకు పవన్ ఏ మాత్రం ఇష్టపడడం లేదు.

త్యాగం అంటే రెండు వైపుల నుంచి ఉండాలని జనసేన ఒకటే త్యాగం చేసి టిడిపికి మేలు కలిగేలా చేస్తే అది  కరెక్ట్ కాదని , టిడిపి కూడా త్యాగానికి సిద్ధపడాల్సిందే అనే విధంగా పవన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది .ప్రస్తుతం జనసేన బలంగా ఉన్న నియోజకవర్గల్లో అభ్యర్థులు ఎంపికైన దృష్టి సారించారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించుకున్నారు.ఈ సర్వేలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏమిటి? ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా దించాలి అనే విషయాలపై సర్వే చేయించారు.ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక,  నియోజకవర్గాల గుర్తింపు పై కసరత్తు మొదలు పెట్టారు .

టిడిపి( TDP ) పొత్తులో భాగంగా 20 సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించే ఆలోచనతో ఉండడంతో, తాము ఏ స్థాయిలో బలంగా ఉన్నామో  నిరూపించుకునేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు.ఈనెల 14 నుంచి అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సాధించారు.  అయితే ఇది మొదటి విడత మాత్రమే అని , దాదాపు 50 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే 20 నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు పూర్తవడంతో,  మరో 30 స్థానాల పైనా పవన్ దృష్టి సాధించారట.

టిడిపి పొత్తులో భాగంగా 20 స్థానాలతో సరిపెడితే కుదరదని, త్యాగం అంటే ఇరు  వైపుల నుంచి ఉండాలని, జనాసేన( Jana Sena ) మాత్రమే త్యాగానికి సిద్ధం అయితే అది పొత్తు ధర్మం కాదు అని,  టీడీపి కూడా త్యాగం చేయాల్సిందే.అన్న లెక్క లో.పవన్ ఉన్నారు.అందుకే జనసేన బలం ఏంటో టిడిపి కి అర్ధం అయ్యేలా చేసి , పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలి అని , ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదనే లెక్కల్లో పవన్ ఉన్నారట

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025
Advertisement

తాజా వార్తలు