విజయవాడలో టీడీపీ ధర్నా.. నెలకొన్న ఉద్రిక్తత

విజయవాడలో టీడీపీ ధర్నాకు దిగింది.రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాతో వేల కోట్లు దోచుకుంటున్నారని బోండా ఉమ ఆరోపించారు.

ఇప్పుడు పన్నులు, ఛార్జీల భారాలతో ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు.జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై రూ.56 వేల కోట్లు భారం మోపారాని విమర్శించారు.అంతేకాకుండా నెలనెలా ట్రూ అప్ ఛార్జీలు మోపడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యనించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని వెల్లడించారు.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు