బాబుకు సొంత జిల్లాలోనే మ‌రో అగ్నిప‌రీక్ష‌...!

ఎవ‌రూ కోర‌కుండానే.రాష్ట్రంలో ఉప ఎన్నిక‌కు తెర‌తీయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

తిరుప‌తి ఎంపీ.

వైసీపీ నాయ‌కుడు బ‌ల్లి దుర్గాప్ర‌సాద్.

హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇప్పుడు మ‌రో ఆరు మాసాల్లో ఇక్క‌డ ఉప పోరుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.అయితే, ఇప్పుడే దీనిపై టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు.పైగా చంద్ర‌బాబు సొంత జిల్లాను సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకు సాగుతుండ‌డం.

Advertisement

ఇక్క‌డ అన్ని ర‌కాలుగా అబివృద్ధి ప‌నులు చేస్తుండ‌డంతో త‌మ్ముళ్లు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.ప్ర‌స్తుతం ఇక్క‌డ‌టీడీపీకి అభ్య‌ర్థి లేర‌నే చెప్పాలి.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని నిల‌బెట్టారు చంద్ర‌బాబు.అయితే ఆమెకు 4 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి.ఇక‌, వైసీపీ నుంచి పోటీ చేసిన‌ దుర్గా ప్ర‌సాద్‌కు దాదాపు 7 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్లు రావ‌డంతోపాటు.2 ల‌క్ష‌ల 28 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించారు.ఇప్పుడు ఇలాంటి స్థానంలో టీడీపీ త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్టి.

వైసీపీ పై పైచేయి సాధించ‌డం అంటే అంత మాట‌లు కాదు.పైగా.

ఈ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులే గెలుపు గుర్రాలు ఎక్కారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!

అంత‌టి కీల‌క‌మైన ఈ స్థానం నుంచి టీడీపీ పోటీ చేయ‌డం.అంటే ముందు అభ్య‌ర్థి ఎవ‌ర‌నేదే ప్ర‌దాన స‌మ‌స్య‌గా మారింది.మ‌రోప‌క్క‌, దుర్గాప్ర‌సాద్‌పై సానుభూతి ఎలాగూ ఉంటుంది.

Advertisement

ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున ఆ కుటుంబం నుంచే అభ్య‌ర్థి రంగంలోకి దిగే అవ‌కాశం కూడా ఉంది.దీంతో టీడీపీ అభ్య‌ర్థిని నిల‌బెట్టినా.

గెలుపుగుర్రం ఎక్కడం అంత ఈజీకాదు.ఇవ‌న్నీ ఇలా.పోనీ.అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌క‌పోతే.

ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు స‌వాల్ చేస్తున్న‌ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబు ఇమేజ్‌కే మాయ‌ని మ‌చ్చ‌.సో.ఇటు పోటీ పెట్టాలంటే.అభ్య‌ర్థీ లేడు.

అటు.పోటీకి దూరంగా ఉండాలంటే.ఇమేజ్ ఒప్పుకోదు.

మ‌రి ఏం చేస్తారో చూడాలి.అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు.

తాజా వార్తలు