ఏపీలో టీడీపీకి రెండు ఎమ్మెల్సీ సీట్లు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓవర్‌యాక్షన్‌ చేసి చేతులు కాల్చుకున్న టీడీపీ ఆంధ్రాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్‌ చేయడంతో టీడీపీకి ఎదురులేకుండాపోయింది.

ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ సీట్లను పసుపు పార్టీ సాధించింది.వైఎస్సార్‌సీపీ మంగళవారం తమ అభ్యర్థిని నిలబెట్టి కూడా ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించడం విచిత్రం.

అభ్యర్థిని కూడా ఉపసంహరించుకోలేదు.ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ సీటును టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏడొందల పదకొండు సీట్లతో గెల్చుకున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ సీటును శిల్పా చక్రపాణి రెడ్డి ఆరొందల ఓట్లతో గెలుచుకున్నారు.వైకాపా అభ్యర్థికి నాలుగొందల డెబ్బయ్‌నాలుగు ఓట్లు వచ్చాయి.

Advertisement

టీడీపీ అవినీతి చేస్తోందని, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు వైకాపా ఇదివరకే ప్రకటించింది.కాని అసలు కారణం ఇది కాదని రాజకీయ పండితులు అంటున్నారు.

ఆంధ్రాలో చంద్రబాబు నాయుడిపై ఒంటరిగా పోరాటం చేస్తున్న వైకాపా, తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్‌తో కలిసి పోరాడుతోంది.టీఆర్‌ఎస్‌కు తన మీడియా ద్వారా జగన్‌ సహకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు