పవన్ దూకుడుపై టీడీపి అలెర్ట్ ! బిజేపి పై అనుమానం ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో మాట్లాడిన మాటలు టిడిపి కూటమిలో ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి .

తమ మిత్రపక్షంగా ఉన్న టిడిపికి పరోక్షంగా పవన్ వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడడం, ఏపీలో శాంతిభద్రతలు అంతగా బాలేదు అన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించడం పై టిడిపిలోను చర్చ జరుగుతుంది.

పిఠాపురం సభ మాదిరిగానే ఏలూరు సభలోని పవన్ ఆవేశంగా మాట్లాడారు.  తేడా వస్తే తాట తీస్తాను అంటూ హెచ్చరికలు చేశారు.

శాంతిభద్రతలు విషయంపై చేసిన కామెంట్స్ సైతం వైరల్ అయ్యాయి.తప్పు జరిగితే సొంత ప్రభుత్వం అయినా చూడననే సంకేతాన్ని పవన్ జనాల్లోకి పంపించడం పైన టిడిపి శిబిరంలో చర్చ జరుగుతోంది.

తమ ప్రభుత్వంలోనూ తప్పులు జరుగుతున్నాయని అర్థం వచ్చేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయనే విషయం స్పష్టం అవుతుంది .ఇక పవన్ దూకుడుగా వ్యవహరిస్తుండడం , సొంత ప్రభుత్వంలోని తప్పులను సైతం ఉపేక్షించేది లేదు అన్నట్లుగా మాట్లాడుతున్న మాటలు జనసైనికుల్లో మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

Advertisement

అయితే తమ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan)జనాల్లో ఈ విధంగా మాట్లాడుతుండడం పై టీడీపీ(TDP) కూడా అలర్ట్ అయింది.  అసలు పవన్ ఎందుకు ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు ? ఆయన వెనుక ఎవరున్నారనే విషయం పైన ఆరా తీస్తోంది.అయితే త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో,  సొంతంగా జనసేన బలం పెంచుకునేందుకు ప్రజల్లో తన పలుకుబడి మరింత మెరుగుపరుచుకునేందుకు పవన్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారా అనే అనుమానం టిడిపిలో మొదలైంది .ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూనే , ప్రతిపక్షంగా విమర్శలు చేస్తుండడం టిడిపి శ్రేణులకు మింగుడు పడడం లేదు.

అయితే పవన్ ఈ విధమైన వైఖరి అటు వైసిపికి ఇబ్బందికరంగానే మారింది.ఇక కేంద్ర బిజెపి పెద్దలకు ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు పవన్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు.పవన్ ద్వారానే ఏపీలో అధికారంలోకి రావాలనే వ్యూహంతో బిజెపి పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

దీనికి తగ్గట్లుగానే పవన్ సైతం యూపీలో బిజెపి సీఎం యోగి తరహాలోనే ఏపీలో పదునైన చట్టం వాడాలని కామెంట్ చేస్తూ ఉండడం,  బిజెపి తరహా పాలన ఏపీలోనూ కావాలనే విధంగా ఆయన మాట్లాడుతుండడం పై టిడిపి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  ఏపీలో అధికారానికి మరింత దగ్గర కావాలని బిజెపి వేస్తున్న ఎత్తులో భాగంగానే పవన్ దూకుడు చూపిస్తున్నారా అనే అనుమానంతో ఉంది.2027 లో జమిలి ఎన్నికలు ఖా ప్రధాని నరేంద్ర మోది ప్రకటించిన దగ్గర నుంచి పవన్ వైఖరిలో మార్పు రావడం పైన టిడిపి ముందస్తు జాగ్రత్తలకు దిగుతోందట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025
Advertisement

తాజా వార్తలు