MP Ravichandra Vaviraju : టార్గెట్ టీఆర్ఎస్.. ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న బీజేపీ?

మునుగోడు ఉప ఎన్నికల అనంతరం తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం హైదరాబాద్, కరీంనగర్‌లో అక్రమ గ్రానైట్ తవ్వకాలపై ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

2011 నుంచి 2013 మధ్య కాలంలో మైనింగ్ క్వారీల నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు కోట్ల విలువైన గ్రానైట్‌లు ఎగుమతి అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.750 కోట్ల నష్టం వాటిల్లిందని 2012లో బీజేపీ ఈ అక్రమ మైనింగ్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 350 మైనింగ్ కంపెనీలు ఉండగా వాటిలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సంబంధించినవి ఎక్కువ.

గతంలో అరవింద్ గ్రానైట్స్, శ్వేతా గ్రానైట్స్ మరియు ఈ మైనింగ్ కంపెనీల యజమానుల నివాసాలపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది.ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి తాజా పరిణామంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది.

 రెడ్డి అరవిందో ఫార్మా సంస్థను నడుపుతుండగా, బాబు పెర్నోడ్ రికార్డ్ సంస్థను నడుపుతున్నారు.అలాగే  గాయత్రీ గ్రానైట్‌ ప్రచారకర్త, టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ రవిచంద్ర వద్దిరాజుపై కూడా ED దాడులు చేసింది.

Advertisement

శ్రీనగర్ కాలనీలోని రవి కార్యాలయంలో ఈడీ దాడులు జరిపింది.

ED చేసిన ఈ దాడులు రాజకీయంగా  ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ఇప్పుడు ఈ వార్తలు  మీడియాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఈ దాడులతో టీఆర్‌ఎస్ శిబిరంలో భయాందోళనలు నెలకొనగా, మరికొందరు టీఆర్‌ఎస్ మంత్రి గంగుల ఆచూకీపై ఆరా తీస్తున్నారు.

 మంత్రి గంగుల ప్రస్తుతం దుబాయ్ టూర్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీంతో టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే ఈ దాడులు జరుగుతన్నాయి.  బీజేపీ టార్గెట్ టీఆర్ఎస్ చేస్తున్న ఎదురు దాడిని నిలువరించడానికి బీజేపీ ఇలా ఈడీ ప్రయోగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు