తారకరత్న జాతకం ప్రకారం విదేశాలకు వెళితే అలా జరుగుతుందా?

త్వరలో తారకరత్నను మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లానున్నారనే సంగతి తెలిసిందే.

ప్రముఖ జ్యోతిష్కురాలు మీడియాతో మాట్లాడుతూ తారకరత్న కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారని ఆమె అన్నారు.

తారకరత్న పుట్టిన సమయం కరెక్ట్ గా తెలియదని పుట్టిన తేదీ ప్రకారం ఆయనపై శని ప్రభావం ఉందని తెలిపారు.తారకరత్నపై శని ప్రభావం ఉండటం వల్లే ప్రస్తుత పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

తారకరత్న మంచి వ్యక్తి అని మంచి వ్యక్తుల విషయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని ఆమె కామెంట్లు చేశారు.విదేశాలకు వెళ్లడం స్థానం మార్పు చేయడం వల్ల ఆయనకు బాగయ్యే అవకాశం ఉందని జ్యోతిష్కురాలు అన్నారు.మృత్యుంజయ హోమం చేయడంతో హనుమాన్ చాలీశా చదివితే ఫలితం ఉంటుందని ఆమె అన్నారు.

తారకరత్న ఆరోగ్యంపై కుజ శని ప్రభావాలు ఉన్నాయని రాహువు కూడా చూస్తోందని జ్యోతిష్కురాలు కామెంట్లు చేశారు.ఆయన కళ్లు తిరిగి పడిపోయిన సమయం, రోజు కూడా జ్యోతిష్యంలో కీలకమని ఆమె తెలిపారు.

Advertisement

దానధర్మాలు చేస్తే ఫలితం ఉంటుందని జ్యోతిష్కురాలు కామెంట్లు చేశారు.మనం ప్రస్తుతం జీవించేది పూర్వ జన్మ కర్మ అని ఆమె పేర్కొన్నారు.

గురు దత్తాత్రేయుని పూజిస్తే మృత్యువు నుంచి బయటపడతారని జ్యోతిష్కురాలు అన్నారు.

ఎక్కువమంది అయనకు మంచి జరగాలని కోరుకుంటే ఆయనకు మంచి జరిగే ఛాన్స్ అయితే ఉందని ఆమె కామెంట్లు చేశారు.పితృ దోషాల వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతాయని జోతిష్కురాలు అన్నారు.నారాయణ బలి పూజ చేయడం వల్ల ఈ దోషాలు హరిస్తాయని ఆమె కామెంట్లు చేశారు.

మరోవైపు తారకరత్న కోలుకోవాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.త్వరలో నందమూరి తారకరత్న సాధారణ మనిషి కావాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు