టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
కాగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలు చేయాల్సి ఉంది.కాగా తాజాగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో OG ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే సినిమాని కూడా తాజాగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్ లో తన పిల్లల కోసం దాచుకున్న డబ్బుతో పార్టీ ఆఫీస్ నిర్మించానని కామెంట్స్ చేశారు.ఆ వాక్యలపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.
మార్కెట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మీరు 50 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటున్నారు.అంత రెమ్యునరేషన్ తీసుకుంటూ పిల్లల ఫీజులు కట్టలేరా అసలు ఎం మాట్లాడుతున్నారు.మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి రాజకీయాల్లో అల్లరి చేస్తారు అంటూ మండి పడుతున్నారు.
ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు.కనీసం జైలుకు కూడా వెళ్ళలేదు.అంత మంది బౌన్సలర్లతో బిల్డప్ ఎందుకు? నేను సామాన్యవ్యక్తినే అంటారు కదా మరి అలాగే వెళ్లి ప్రజల్ని కలవండి.మీ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ.
ఎప్పుడో ఒకసారి రావడం మీటింగ్ పెట్టి అందరిని తిట్టి వెళ్లిపోవడం కాదు ఇదంతా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్.మొదట ఫస్టు పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేయండి.
సినిమాలు చేస్తూనే ఉన్నారు.రాజకీయాలు చేస్తున్నారు.
కానీ మీరు గాడి తప్పుతున్నారు.మీరు పార్టీ పెట్టినప్పుడు మంచి యువకుడు వస్తున్నాడు అని సంతోష పడ్డాం.
ఇప్పుడు మీ వైఖరితో విసిగిపోతున్నాం అంటూ తమ్మారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ్మారెడ్డి భారద్వాజ చేసిన వ్యాఖ్యల గురించి చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
తమ్మారెడ్డి వాఖ్యలపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy