వాట్ ఈజ్ దిస్ తలైవా?

తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఇటీవల రిలీజ్ అయిన జైలర్ సినిమా ఘనవిజయం సాదించడం తో చాలాకాలం తర్వాత తలైవా అభిమానులు గర్వంగా కాలరేగరేస్తున్నారు .

తమని చిన్నచూపు చూసిన చాలామంది హీరో ల అభిమానుల కళ్ళు తెరిపించేలా పాత రికార్డులనుతిరగ రాస్తున్న రజనీ బాక్సాఫీస్ పై తన పట్టును మరొకసారి చూపిస్తున్నారు.

అయితే ఆయన చేసిన ఒక పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఏ కారణంతో వెళ్లారో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్కి వెళ్లిన రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్( Yogi Adityanath ) కాళ్లకు మొక్కుడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ ఒక మాట మీద ఉంటారని బావించే తమిళ ఓటర్లు హిందీ రాజకీయాల పట్ల గాని రాజకీయ నాయకులు పట్ల గాని విముఖత తో ఉండటం తమ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాది పెద్దల జోక్యాన్ని అసలు సహించలేని తమిళ తంబీలకు ఇప్పుడు రజనీకాంత్ చర్య తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది .

వారు ఇప్పుడు రజనీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని రజనీ ఆధ్యాత్మిక దృష్టి కూడా అందరికీ తెలిసిన విషయమే అని, ప్రతి సంవత్సరం అనేక ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే తలైవా పీఠాలు, పీఠాధిపతులు విషయంలో భక్తి ప్రపత్తుల తో ఉంటారని ఆదిత్యనాథ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ స్వతహాగా ఆయన ఒక సన్యాసి అని ఒక పీఠానికి అధిపతి అని అందువల్లనే తనకన్నా 20 సంవత్సరాలు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్కు ఆధ్యాత్మిక కోణంలో నమస్కరించారే తప్ప అది తన ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టుకోవడం కాదు అని ఆయనకు రాజకీయాల ఆపాదించడం సరికాదంటూ ఆయన అభిమానులు మద్దతు ఇస్తున్నారు .అయితే ఏది ఏమైనప్పటికీ రజినీకాంత్ చర్య మాత్రం దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులను ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు.

Advertisement
చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

తాజా వార్తలు