స్టార్ హీరో ఇంటికెళ్లిన తమిళనాడు సీఎం..!

తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్ ను ఆయన ఇంటికెళ్లి మరి కలిశారు.

ఒకప్పటి స్టార్ హీరో విజయకాంత్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన్ను చూసేందుకు ఆదివారం సీఎం స్టాలిన్ ఆకస్మికంగా విజయకాంత్ ఇంటికెళ్లారు.

Tamilnadu CM MK Stalin Met Hero Vijayakanth, Captain Vijaykanth, Cm, Hero, Hero

సీఎం స్టాలిన్ విజయకాంత్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు.అనారోగ్య కారణంగా బాధపడుతున్న విజయకాంత్ ను సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కలవడానికి వెళ్తే కరోనా రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షలు ముఖ్యమంత్రికి అందించారు విజయకాంత్.స్టాలిన్ విజయకాంత్ ను కలిసిన సందర్భంలో ఆయనతో పాటు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంపీ బీఈ రాసా కూడా ఉన్నారు.

Advertisement

విజయకాంత్ ఆరోగ్యం గురించి స్టాలిన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.అయితే వీరిద్దరి ఈ సడెన్ మీటింగ్ పట్ల రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది.

స్టాలిన్ ప్రత్యేకంగా విజయకాంత్ ఇంటికి ఎందుకు వెళ్లారు.నిజంగానే ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుందామని వెళ్లారా లేక దీని వెనకాల ఏదైనా రాజకీయం ఉందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.

 సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి తన కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుస్తున్నారు సీఎం ఎం.కే స్టాలిన్.తన మార్క్ పాలనతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ - 20
Advertisement

తాజా వార్తలు