Tamannaah Bhatia : అవును నాకు ఆ సమస్య ఉంది.. అలా చెయ్యకపోతే ఉండలేను.. తమన్నా వైరల్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా( Heroine Tamannaah ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె అందానికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ కి 18 ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు.అయినా కూడా ఆమె ఇప్పటికి 25 ఏళ్ళ యువతి లాగే కనిపిస్తోంది.

వయసుతోపాటు ఆమె అందం కూడా పెరుగుతోంది.

Advertisement

ఇకపోతే తమన్నా తెలుగులో ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, వెంకటేష్, చిరంజీవి, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా( Star Heroine ) గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే తమన్నా సినిమాల విషయానికి వస్తే.

ఈ ముద్దుగుమ్మ జైలర్, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇందులో జైలర్ సినిమా సూపర్ హిట్ కాగా భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) డిజాస్టర్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా తమన్నా కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

మిల్కీ బ్యూటీ ఇప్పుడు ఒక సమస్యతో ఇబ్బంది పడుతోందట.అదే బరువు సమస్య( Overweight ).

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఆమె ఈ మధ్య బరువు పెరిగింది.నిత్యం జిమ్ కి వెళ్తుంది ఈ భామ.అలాగే ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంది.అయినా, అప్పుడప్పుడు ఆమె బొద్దుగా కనిపిస్తోంది.

Advertisement

మూడు, నాలుగు రోజులు జిమ్ కి డుమ్మా కొడితే వెంటనే బరువు పెరుగుతున్నాను అంటోంది ఈ భామ.ఇదే ఆమెకున్న సమస్య.మొన్నటికి మొన్న జైలర్ సినిమాలో అలానే బొద్దుగా కనిపించింది.

అలాగే, తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె రాంప్ పై నడిచింది.అప్పుడూ అలాగే కనిపించింది.

ఒక్క రోజు కూడా జిమ్( Gym ) ఎగ్గొట్టకుండా కష్టపడితేనే ఆమె ఫిట్ గా ఉంటుంది అన్నమాట.ఇప్పటివరకు దాదాపుగా 75 కు పైగా సినిమాలలో నటించింది.

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించింది.ఇక తమన్నా వ్యక్తిగత విషయానికి వస్తే.గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ విజయ్ వర్మ( Vijay Varma )తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలె ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు.అప్పటినుంచి ఈ జంటకు సంబంధించి ఏదో ఒక రకమైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే తమన్న పెళ్ళికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు