తమన్నా పోయి తాప్సి వచ్చింది.. సినిమాను ఇంకేం చూస్తాం?

యాంకర్‌ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్‌ రాజు గారి గది సిరీస్‌ను కొనసాగిస్తున్నాడు.ఇప్పటికే రెండు పార్ట్‌లను ఓంకార్‌ తీసుకు వచ్చాడు.

మొదటి పార్ట్‌ సూపర్‌ హిట్‌ అవ్వగా రెండవ పార్ట్‌ జస్ట్‌ యావరేజ్‌ అనిపించుకుంది.ఇప్పుడు మూడవ పార్ట్‌ గురించిన ఏర్పాట్లోలో ఓంకార్‌ ఉన్నాడు.

ఇటీవలే సినిమాను ప్రారంభించాడు.సొంతంగా నిర్మించబోతున్న ఈ చిత్రంలో తన తమ్ముడు అశ్విన్‌ బాబును హీరోగా పెట్టాడు.

ఇక హీరోయిన్‌గా తమన్నాను అనుకున్నాడు.ఆమె షూటింగ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంది.

Advertisement

ఇంతలో ఏమైందో కాని తమన్నా రాజు గారి గది నుండి బయటకు వచ్చేసింది.బాబోయ్‌ తన వల్ల కాదు అన్నట్లుగా ఆమె బయటకు వచ్చేసింది.దాంతో ప్రస్తుతం రాజు గారి గది కోసం హీరోయిన్‌ ఎంపికలో ఓంకార్‌ ఉన్నాడు.

ఆయన ముందు కనిపిస్తున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం తాప్సి.ఔను ఈమద్య కాలంలో ఈ అమ్మడు తెగ హర్రర్‌ చిత్రాలు చేసింది.

అందుకే ఈమెను తన సినిమాలు తీసుకోవాలనే నిర్ణయానికి ఓంకార్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

తాప్సి ఇప్పటి వరకు చేసిన హర్రర్‌ సినిమాల్లో ఒక్కటి అర పర్వాలేదు అనిపించాయి.అందులో కూడా తాప్సి నటన సాదా సీదాగానే ఉందనే విమర్శలు వచ్చాయి.అయినా కూడా ముద్దుగుమ్మ తాప్సిని తన రాజు గారి గదిలోకి ఆహ్వానించాలనే నిర్ణయానికి ఓంకార్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఊరి కోసం ప్రాణ త్యాగం చేసిన ముసలమ్మ కథ ఏమిటో మీకు తెలుసా..?

అయితే తమన్నా అయితే అంతో ఇంతో సినిమాకు క్రేజ్‌ ఉండే అవకాశం ఉండేది.కాని తాప్సికి పెద్దగా క్రేజ్‌ లేదు.ఆమె నటిస్తే సినిమాను ఏం చూస్తాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడించడంతో పాటు సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.ఇదే ఏడాదిలో లేదంటే వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

తాజా వార్తలు