చిరు నాగ్‌లతో మంత్రి భేటీ, కారణం ఏంటో?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నేడు టాలీవుడ్‌ స్టార్స్‌ అయిన చిరంజీవి మరియు నాగార్జులను ఒకే చోట కలవడం జరిగింది.

చిరంజీవి నివాసంకు వెళ్లిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది.

చిరంజీవి దంపతులు తలసానిని ఆహ్వానించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది.అదే సమయంలో నాగార్జున కూడా అక్కడ ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

నాగార్జున మరియు చిరంజీవిలతో కేసీఆర్‌ ఆదేశాల మేరకు సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలు మరియు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తలసాని చర్చించాడంటూ సమాచారం అందుతోంది.తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు వస్తుందని అన్నాడు.

పేద కళాకారులకు సాయం చేసేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లుగా మంత్రి ఆ ఇద్దరు స్టార్స్‌తో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి ఈ భేటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయ్యింది.

Advertisement
Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable