ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

పెరుగు ఎండుద్రాక్షలు తినడం అనేది అద్భుతమైన ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.రక్తపోటు ఉన్నవారు రోజు వీటిని తినడం ఎంతో మంచిది.

ఎండు ద్రాక్ష( Raisins ) పెరుగు( Curd ) తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తింటే పేగులకు మేలు జరుగుతుంది.

ఎందుకంటే పెరుగు, ఎండు ద్రాక్షను కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.అంతేకాకుండా దీని వినియోగం పేగు మంట ను కూడా తగ్గిస్తుంది.

మీరు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటే సులభంగా వ్యాధులకు గురవుతారు.అటువంటి పరిస్థితిలో మీరు పెరుగులో ఎండు ద్రాక్షను కలిపి తీసుకుంటే అది రోగ నిరోధక శక్తిని( Immunity Power ) పెంచుతుంది.

Advertisement

అంతేకాకుండా శరీరంలో ఐరన్ లోపం( Iron Deficiency ) కారణంగా రక్తహీనత కూడా ఉంటుంది.పెరుగులో ఎండుద్రాక్షను కలిపి తీసుకుంటే అది శరీరంలోని ఐరన్ లోపాన్ని కూడా దూరం చేస్తుంది.దీని వల్ల రక్తహీనత( Anemia ) వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.

దంతాలు, చిగుళ్ల సమస్యతో బాధపడేవారు ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తింటే నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.రోజు ఎండు ద్రాక్ష పెరుగు తినడం వల్ల పురుషులకు ప్రయోజనకరంగా ఎంతో ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే పెరుగు అనేక ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

అందుకే పెరుగు తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇది పురుషుల లైంగిక సమస్యలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే పెరుగు మంచి ప్రోబయోటిక్( Probiotic ) ఆహారం.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

అలాగే ఎండు ద్రాక్షలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది.మొదట ఒక గిన్నెలో నాలుగు నుంచి ఐదు ఎండుద్రాక్ష, కొద్దిగా పెరుగు కలపాలి.

Advertisement

పెరుగును కనీసం 8 గంటల పాటు అలాగే ఉంచాలి.పెరుగును ఎండు ద్రాక్షతో కలిపి మధ్యాహ్నం భోజనంలో లేదంటే సాయంత్రం 4 గంటల తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

తాజా వార్తలు