రాగి జావా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు....

మనం ప్రతిరోజు కూరగాయలు, పండ్లు, పప్పులు ఇలా చాలా రకాల పోషకాలు ఉన్న ఆహారం మనం తింటూనే ఉంటాం.

ఇలా పోషకాలు అందించే సిరి ధాన్యాలలో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి.

వీటితో ప్రజలు చాలా రకాల పదార్థాలను చేసుకుని తింటుంటారు.అయితే రాగులతో జావ చేసుకుని తాగితే ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.

రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తాయి.రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.దానిలోని కాల్షియం పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

Advertisement

ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం చాలా మంచిది.రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంది యవ్వనంగా కనిపిస్తారు.రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.రాగి జావను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

Advertisement

రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి.ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది.

అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు.వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది.

రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా ఉపయోగపడతాయి.

తాజా వార్తలు