పెరుగులో ఇవి రెండూ కలిపి తీసుకుంటే ఎలాంటి జలుబు అయినా వెనక్కి తగ్గాల్సిందే!

ప్రస్తుత వర్షాకాలంలో అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో జలుబు ముందు వరుసలో ఉంటుంది.

చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా ఈ వర్షాకాలంలో అందరినీ పలకరించే బంధువు జలుబు.

అంత పెద్ద అనారోగ్యం కాదు, అలాగని బాధ పెట్టకుండా ఉండదు.చిన్న సమస్యే అయినప్పటికీ జలుబు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

జలుబు వల్ల తలంతా బరువుగా ఉంటుంది.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

సరిగ్గా నిద్ర పట్టదు.అలాగే ఒక్కోసారి జలుబు జ్వరానికి కూడా దారితీస్తుంది.

Advertisement

అందుకే జలుబు అంటేనే భయపడుతుంటారు.

ఈ క్రమంలోనే జలుబు( Cold )ను తగ్గించుకునేందుకు మందులు వాడుతుంటారు.అయితే మందులతో పని లేకుండా సహజంగా కూడా జలుబును వదిలించుకోవచ్చు.అందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా ఉత్త‌మంగా సహాయపడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే ఎలాంటి జలుబు అయినా వెనక్కి తగ్గాల్సిందే.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగును వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ తాటి బెల్లం పొడి( Palm Jaggery Powder ), పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పగటిపూట ఏదో ఒక సమయంలో తీసుకోవాలి.

అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు వ్యక్తి.. దాన్ని కాపాడుకోలేకపోయారు..??
జిమ్, సర్జరీ లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్.. ఎలా సాధ్యమైందంటే?

రోజుకు ఒకసారి ఈ విధంగా చేశారంటే చాలా తొందరగా జ‌లుబు తగ్గు ముఖం పడుతుంది.పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Advertisement

ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాల నుండి మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.వ‌ర్షాకాలంలో జలుబు మరియు ఫ్లూ ఉన్నప్పుడు పెరుగు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగే నల్ల మిరియాల్లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ జ‌లుబును త‌గ్గ‌డంతో అత్యంత ప్రభావవంతంగా ప‌ని చేస్తాయి.జ‌లుబుకు కార‌ణ‌మ‌య్యే ఇన్ఫెక్షన్లతో స‌మ‌ర్థ‌వంతంగా పోరాడ‌తాయి.

ఇక‌పోతే తాటి బెల్లం ఊపిరితిత్తుల యొక్క న్యాచుర‌ల్ క్లెన్సింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది.శ్వాసకోశ మార్గాలను శుభ్రపరుస్తుంది.

మరియు శ్వాస తీసుకోవ‌డాన్ని సులభతరం చేస్తుంది.జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌ల‌ను త‌రిమి త‌రిగి కొడుత‌కుంది.

తాజా వార్తలు