ఎండ‌ల దెబ్బకు త‌ల తిరుగుతోందా? అయితే మీరు ఈ డ్రింక్ తాగాల్సిందే!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మార్చి నెల నుంచే ఎండ‌లు ప్రారంభం కాగా.

ఏప్రిల్ వ‌చ్చే స‌రికి మ‌రింత భారీగా పెరిగిపోయాయి.ఈ ఎండ‌ల‌ను త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు.

బ‌య‌ట కాలు పెట్టాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు.ఇక ఎండ‌ల దెబ్బ‌కు త‌ర‌చూ కొంద‌రికి త‌ల తిరిగిపోతుంటుంది.

దాంతో ఏ ప‌ని చేయ‌లేక తీవ్రంగా స‌త‌మ‌తం అవుతుంటారు.ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా.? అయితే ఇక‌పై చింతించ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే త‌ల తిర‌గ‌డం త‌గ్గ‌డ‌మే కాదు.

Advertisement

మ‌రెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ స‌బ్జా గింజ‌లు, వాట‌ర్ వేసుకుని నాన‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజ‌లు, మూడు టేబుల్ స్పూన్ల పుచ్చ‌కాయ ముక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల పైనాపిల్ ముక్కలు, నాన‌బెట్టుకున్న స‌బ్జా గింజ‌లు, చిటికెడు న‌ల్ల ఉప్పు, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌టిక బెల్లం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం, కొన్ని పుదీనా ఆకులు, రెండు గ్లాసుల చిల్డ్‌ వాట‌ర్ పోసి బాగా మిక్స్ చేసుకుని అరగంట పాటు వ‌దిలేయాలి.ఆపై ఈ డ్రింక్‌ను సేవించాలి.ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఈ డ్రింక్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే త‌ల తిర‌గ‌డం, త‌ల నొప్పి, ఒత్తిడి, ఆందోళ‌న‌ వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే డీహైడ్రేష‌న్‌, స‌న్ స్ట్రోక్‌ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటారు.శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.నీర‌సం, అల‌స‌టను సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మ‌రియు ఈ డ్రింక్‌ను తీసుకుంటే బాడీ యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా కూడా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు