వింత: వాకింగ్ చేస్తోన్న చేపల్ని ఎపుడైనా చూశారా?

బేసిగ్గా చేపలనేవి పాకుతాయి.వాకింగ్ చేయడం అనేది చాలా అరుదైన చేపలలో సంభవిస్తుంది.

అయితే పాకే చేపలనే వాకింగ్ చేసేలా చేసాడు ఓ యూట్యూబర్.అవును.

తైవాన్‌కు చెందిన హువాంగ్‌ జెర్రీ అనే యూట్యూబర్‌కు ఓ డౌట్ వచ్చింది.అదేమంటే పెంపుడు జంతువులను అందరూ మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు బయటకు తీసుకెళుతూ వుంటారు.

అలాంటప్పుడు తాను పెంచుకుంటున్న గోల్డ్‌ ఫిష్‌లతో బయటికి వెళ్లే మార్గం లేదా అని ఆలోచించాడు.అనుకున్నదే తడవుగా ‘వాకర్‌ ఫిష్‌ ట్యాంక్‌’ను తయారు చేసేశాడు.

Advertisement
Taiwan Youtuber Creates Fish Tank Stroller To Take Pet Gold Fish Walking Details

దాంతో ఎంచక్కా చేపలతో కలిసి ఆటగాడు వాకింగ్ చేసేస్తున్నాడు.అయితే ఆటగాడు ఆ ‘వాకర్‌ ఫిష్‌ట్యాంక్‌’ చేయడానికి ఎంతో కష్టపడ్డాడు.

మంచి దృఢంగా ఉండే ఆక్రిలిక్‌ ఫైబర్‌ గాజు, గట్టి ఉక్కు మెటీరియల్‌తో దాన్ని రూపొందించాడు.చేపలకు ఆహారం వేసేందుకు కూడా అందులో ఏర్పాటు చేశాడు.

నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే చిన్నపాటి ఫిల్టర్‌ను, నీటిలో ఆక్సిజన్‌ సరిగా ఉండేందుకు.గాలిని పంపే ఎయిర్‌పంప్‌ను అద్భుతంగా అమర్చాడు.

ఇవి నడిచేందుకు ఓ బ్యాటరీని కూడా అనుసంధానించాడు.అందువలన నీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండానే.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ఎక్కడికైనా, ఎంతసేపైనా ‘ఫిష్‌’తో వాకింగ్‌కు వెళ్లొచ్చన్నమాట.

Taiwan Youtuber Creates Fish Tank Stroller To Take Pet Gold Fish Walking Details
Advertisement

హువాంగ్‌ ఇలా తన చేపలతో వాకింగ్‌కు వెళితే.అక్కడ చుట్టూతా జనమంతా కళ్లప్పగించి చిత్రంగా చూస్తున్నారట.అంతేకాకుండా అతగాడిని సలహాలు అడిగి తాము కూడా ట్రై చేస్తామని చెబుతున్నారట.

కాగా యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.ఇంతకుముందు జపాన్‌కు చెందిన ఎంఏ కార్పొరేషన్స్‌ చేసిన ‘పోర్టబుల్‌ ఫిష్‌ ట్యాంక్‌’ ఇది.ఎక్కడికైనా అలా చేతిలో పట్టుకుని వెళ్లిపోయేలా దీనిని రూపొందించారు.ఇక ఆ ఐడియాని వాడి కొంతమంది చేపలు, పీతలు వంటివి ఫ్రెష్‌గా తినాలనుకునేవారు వాటిని తెచ్చిపెట్టుకునేందుకు ఈ ట్యాంక్‌ను వాడేస్తున్నారట.

తాజా వార్తలు