టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగలం పాదయాత్ర తాడిపత్రి నియోజకం వర్గానికి చేరుకుంటుంది… తన పాదయాత్ర సాగుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడి ప్రజల సమస్యలను,ఇక్కట్లను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ సాగుతున్న లోకేష్ అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరును ఎండగడుతూ వారిని విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆయా ఎమ్మెల్యేలు కూడా లోకేష్ విమర్శలపై ఎదురు దాడి చేస్తూ ప్రతి సమాధానం చెబుతున్నారు అయితే విమర్శలు చేయకముందే లోకేష్ కి ముందస్తు వార్నింగ్ ఇచ్చేశారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి .( MLA Kethireddy Peddareddy )
పులివెందులకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఫ్యాక్షన్ తగాదాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.జేసీ బ్రదర్స్ తో వ్యక్తిగత వైరం స్థాయిలో గొడవలు ఉన్నాయి.ఇప్పటికే మీడియా ముఖంగా ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్న చరిత్ర కూడా ఈ వర్గాలకు ఉంది ఇప్పుడు ఈ నియోజక వర్గం లో లోకేష్ పర్యటన మరొక సారి ఇక్కడ వాతావరణాన్ని హై టెన్షన్ కు గురిచేస్తుంది.
తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ పూర్తిస్థాయిలో ఇక్కడికి సంబంధించిన వ్యవహారాలపై నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని అసత్యాలను ,అర్థసత్యాలను ప్రచారం చేయకూడదని జేసీ బ్రదర్స్ రాసిచ్చిన స్క్రిప్టును చదవటం కాకుండా ఇక్కడ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడాలని ఇప్పటికే మీడియం ముఖంగా పెద్దిరెడ్డి హెచ్చరించారు.జెసి బ్రదర్స్( JC Brothers ) చేసిన అరాచకాలపై పూర్తి స్థాయి ఆధారాలు తన వద్ద ఉన్నాయని
తెలుగుదేశం కార్యకర్తలను విపరీతంగా ఇబ్బంది పెట్టిన జె సి వర్గాన్ని పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందనిఆయన చెప్పుకొచ్చారు .జేసీ బ్రదర్స్ అరాచకాలపై ధర్నాలు కూడా టిడిపి నాయకులు చేశారని, పరిటాల రవిని చంపింది జెసి వర్గమే అని పరిటాల కుటుంబం బహిరంగంగా చెప్పినా కూడా వారితో కలిసి చేట్టా పట్టాలు వేసుకొని లోకేష్ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.పాదయాత్రలో తనపై అనవసర విమర్శలు చేస్తే మాత్రం లోకేష్ వద్దకు వెళ్లి పంచాయతీ పెడతానని ఈ విషయంలో ఎవరికీ భయపడే రకం కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు మరి విమర్శలు చేయకముందే వార్నింగ్ ఇస్తున్న పెద్ద రెడ్డి పై లోకేష్ ఏ రకంగా స్పందిస్తారని ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy