Heart attack : హార్ట్ ఎటాక్ లక్షణాలు ఛాతిలో కాకుండా వీటిలో కనపడతాయి..!

ఒక వ్యక్తికి ఎప్పుడైనా గుండెపోటు( Heart attack ) రావచ్చు.ఇది ప్రధానంగా పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా వస్తూ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాదిమంది గుండెపోటుతో మరణిస్తున్నారు.ఒక వ్యక్తికి గుండెపోటు రావడానికి కారణం మనం తినే ఆహారంలోని అదుపు కొలెస్ట్రాల్ రక్తనాళాలలో చేరడం వలన ఆ రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు వస్తుంది.

ఇక పిల్లల్లో గుండె జబ్బులు( Heart diseases ) వచ్చే అవకాశం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ అది పూర్తిగా తప్పు.

పిల్లలకు కూడా గుండెపోటు రావచ్చు.ఒక వ్యక్తికి సాధారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే కొన్ని లక్షణాలను చూడడం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుంది.

Advertisement

చాలామంది ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని మాత్రమే గుండెపోటు యొక్క లక్షణంగా గమనిస్తారు.కానీ గుండెపోటు రాబోతుందంటే అది కళ్ళలో కూడా లక్షణాలను చూపిస్తుంది.కళ్ళలో కనిపించే గుండెపోటు సంకేతాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ళలో ఎరుపు మరియు కొద్దిగా పసుపు రంగు కనిపిస్తుంది.అలా కనిపిస్తే కళ్ళ( Eyes )లో రక్తప్రసరణ తక్కువగా ఉండడం కారణం.

కాబట్టి అకస్మాత్తుగా కళ్ళలో ఈ రకమైన మార్పు కనిపిస్తే అది గుండె సమస్యకు సంకేతం అని తెలుసుకోవాలి.ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం అకస్మాత్తుగా ఉబ్బినట్లు కనిపిస్తే కూడా గుండెకు సంబంధించిన సమస్య వలన కళ్ళ చుట్టూ నీరు నిలిచిపోయి వాపు వస్తుంది.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.అలాగే కంటికి ఏ వస్తువు కూడా సరిగా కనిపించదు.అలాంటప్పుడు గుండె సమస్య వలన కళ్ళకు రక్తప్రసరణ తగ్గుతుంది.

Advertisement

తత్వలితంగా చూసే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.ఈ సమయంలో వెంటనే డాక్టర్ కు తెలియజేయడం మంచిది.

ఇక తరచూ కనురెప్పలు పడిపోతున్నట్లు కనిపిస్తే కూడా ఇది గుండెపోటుకు ప్రమాదకరమైన సంకేతం.కంటిరెప్పల రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఆ ప్రాంతంలోని కండరాలు బలహీనంగా మారిపోతాయి.

ఈ సమయంలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తాజా వార్తలు