కుక్క పిల్లలకు డిజైనర్ డ్రెస్సులు.. వీటి ధర ఏకంగా...?

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని కొన్ని దేశాల్లో ఎండాకాలం నడుస్తోంది.ఈ ఎండకి మూగ జంతువులు అల్లాడిపోతున్నాయి.

పెంపుడు జంతువుల యజమానులు కూడా వాటిని బయటకి తీసుకురాలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జపాన్‌కు చెందిన స్వీట్ మమ్మీ అనే కంపెనీ వినూత్న ఆలోచన చేసింది.

జంతువులకు చల్లని గాలిని అందించే ఒక డ్రెస్‌ను సిద్ధం చేసింది.ఇది ఒక నైట్ డ్రెస్ అట.అందువల్ల దీనిని తొడుక్కుంటే జంతువులకు ఎలాంటి ఉక్కపోత సమస్యలు ఎదురు కావు.గాలి అన్ని పక్కలనుంచి తాకుతుంది.

విశేషమేంటంటే, ఈ చిట్టి నైట్ డ్రెస్ పైన ఒక చిన్న ఫ్యాన్ సైతం అందించారు.ఈ ఫ్యాన్ తిరుగుతూ జంతువులకు కావలసిన గాలిని అందజేస్తుంది.

Advertisement

మాటెర్నిటీ క్లోతింగ్ కంపెనీ స్వీట్ మమ్మీ ప్రెసిడెంట్ అయిన రీ ఉజావా ఈ డ్రెస్ ని తయారు చేశారు.ఈమె కూడా తన కుక్కపిల్ల ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతుంటే చూసి చలించిపోయారు.

తర్వాత బాగా ఆలోచించి దీనికి ఒక నైట్ డ్రెస్ యే పరిష్కారం అనుకున్నారు.దానిని తయారు చేసి ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

ఒక వల లాగా ఉండే ఈ కోట్‌కు ఒక చిన్న ఫ్యాన్‌ అమర్చామని.ఈ డ్రెస్‌ను కుక్కలతోపాటు పిల్లులకు కూడా సరిగ్గా పడుతుందని ఉజావా వెల్లడించారు.ఇందులోని ఫ్యాన్‌ బ్యాటరీ సాయంతో నడుస్తుందని వివరించారు.

డైలీ 10 నిముషాలు ఛార్జ్ చేస్తే చాలు ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందన్నారు.దీని ధర 60 (సుమారు రూ.5,765) పౌండ్స్ అని కంపెనీ తెలిపింది.మరి ఇంకెందుకు ఆలస్యం.? మీకు కూడా ఒక పెంపుడు జంతువు ఉంటే ఈ డ్రెస్ కొనేయండి.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!
Advertisement

తాజా వార్తలు