సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్( Salman Khan ) నివాసం వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ మేరకు కస్టడీలో ఉన్న నిందితుడు అనూజ్ తపన్( Anuj Thapan ) జైలులోని తన బ్యారక్ లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అనూజ్ తపన్ ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు నిర్దారించారని తెలుస్తోంది.

Suspect Died In Shooting Case At Salman Khan House Details, Salman Khan, Bollywo

అయితే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో( Bandra ) ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు నిర్వహించిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ లకు మృతుడు అనూజ్ ఆయుధాలు అందించాడని ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఏప్రిల్ 26న అనూజ్ ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా అనూజ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని సమాచారం.

Advertisement
జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 

తాజా వార్తలు