క్యాబేజీలో ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకాశించే చర్మం మరియు శక్తివంతమైన రోగనిరోదక వ్యవస్థకు అవసరమైన పోషకాలు సాదారణ కురగాయాల్లో ఉంటాయని మర్చిపోకూడదు.కురగాయాల్లో క్యాబేజీ చాలా శక్తివంతమైనది.

దీనిలో అధిక సల్ఫర్ మరియు విటమిన్ సి ఉండుట వలన ప్రాచీన కాలం నుండి క్యాబేజీని నయం చేసే లక్షణాలకు ప్రసిద్ది చెందిందని చెప్పతూ ఉన్నారు.అందువల్ల ఈ శక్తివంతమైన ఆహారాన్ని వారంలో ఒకసారి మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1.బరువు నష్టం కోసం

ఒక కప్పు వండిన క్యాబేజీలో కేవలం 33 కేలరీలు మాత్రమే ఉంటాయి.దీనిలో కొవ్వు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది.అందువల్ల దీనిని ఖచ్చితంగా ఒక చురుకైన కార్బ్ అని చెప్పవచ్చు.

2.ఇది ఒక బ్రెయిన్ ఆహారం

దీనిలో విటమిన్ K మరియు యాంతోసైనిన్లు సమృద్దిగా ఉండుట వలన మానసిక కార్యకలాపాలు మరియు ఏకాగ్రతకు సహాయపడుతుంది.

దీనిలో ఉండే పోషకాలు నాడి నష్టాన్ని నిరోదించి అల్జీమర్స్ వ్యాధి మరియు చిత్తవైకల్యంనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.ఎర్ర క్యాబేజీలో శక్తి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

3.అధికమైన సల్ఫర్ మరియు ఖనిజాలు

జిడ్డు మరియు మొటిమలు ఉన్న చర్మాన్ని పొడిగా చేయటానికి క్యాబేజీ సహాయపడుతుంది.ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు మరియు చర్మం కోసం అవసరమయిన ప్రోటీన్ పదార్ధం కెరాటిన్ కి సల్ఫర్ అతి ముఖ్యమైనది.

4.నిర్విషీకరణ చేస్తుంది

క్యాబేజీలో విటమిన్ సి మరియు సల్ఫర్ అధిక మొత్తంలో ఉండుట వలన విషాన్ని (స్వేచ్ఛారాశులు మరియు యూరిక్ ఆమ్లం) తొలగించటానికి సహాయపడుతుంది.

స్వేచ్ఛారాశులు మరియు యూరిక్ ఆమ్లం కారణంగా కీళ్ళనొప్పులు, చర్మ వ్యాధులు, కీళ్ళ వాతం మరియు గౌట్ వ్యాధులు వస్తాయి.

Advertisement
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు