బాలయ్య షోలో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఏం జరిగిందంటే?

బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా అన్ స్టాపబుల్ (Un Stoppable) కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఆహాలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికే మూడు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగవ సీజన్ ప్రసారమవుతుంది.

నాలుగవ సీజన్లో భాగంగా ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రసారం కాగా మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.మూడో ఎపిసోడ్లో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) హాజరయ్యారు.

సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమా(Kanguva Movie) నవంబర్ 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో భాగంగా బాలకృష్ణ సూర్యను వేదికపైకి ఆహ్వానిస్తూ నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్ అయితే అతను గజినీ, నేను అఖండ అయితే అతను రోలెక్స్ అంటూ అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు.ఇక బాలకృష్ణ సూర్యను తికమక పెడుతూ ప్రశ్నలు వేస్తూ ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు.

Advertisement

ఇక తన తమ్ముడు కార్తీ పేరును తన ఫోన్లో ఏమని సేవ్ చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు.అలాగే తన తమ్ముడికి ఫోన్ చేసి మరి సూర్య గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.కార్తీకి ఫోన్ చేసి మీ అన్నయ్య చాలా అబద్దాలు ఆడారని చెప్పగానే కార్తీ కూడా చిన్నప్పటి నుంచి అంతే సార్ అంటూ కౌంటర్ వేశాడు.

అలాగే ఓ నటి అంటే ఆయనకు చాలా ఇష్టం సార్ అని కార్తీ అంటే.వెంటనే సూర్య నువ్వు కార్తీ కాదురా కత్తి అంటూ తమ్ముడు గురించి సరదాగా మాట్లాడారు.

ఇక సూర్య తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సూర్య వల్ల చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయి సూర్య గురించి మాట్లాడుతున్న ఒక వీడియోని ప్లే చేశారు.

ఆ మాటలు విన్న సూర్య ఎమోషనల్ అయ్యారు.ఇక తన ట్రస్ట్ నడపడం కోసం కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా తెలుగు వారు కూడా తనకు ఫండ్ ఇచ్చారు అంటూ సూర్య ఈ కార్యక్రమంలో తెలియజేశారు.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?
Advertisement

తాజా వార్తలు