ఐఏఎస్ శ్రీలక్ష్మీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఐఏఎస్ శ్రీలక్ష్మీకి భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఓఎంసీ కేసులో విచారణలో భాగంగా శ్రీలక్ష్మీకి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అయితే దివంగత నేత వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈ క్రమంలోనే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా గనులు కేటాయించారని అభియోగిస్తూ సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సీబీఐ కోర్టులో తీర్పుపై ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం శ్రీలక్ష్మీపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు