పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంలో విచారణ

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు ఉన్న 7.

15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతి కోరారు.అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది.అనంతరం ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై స్టే విధించింది.కాగా జరిమానా విధింపుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణ ఆగస్టులో చేపడతామని వెల్లడించింది.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!
Advertisement

తాజా వార్తలు