40 సంవత్సరాల చరిత్ర ఉన్న "రజినీకాంత్" థియేటర్ కూల్చివేత.. అసలేం జరిగిందంటే?

తాజాగా 40 సంవత్సరాల చరిత్ర కలిగిన మరొక థియేటర్ నేలమట్టం అయ్యింది.

అప్పుడెప్పుడో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) చేతుల మీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమయ్యింది ఈ బృందా థియేటర్.

ఈ థియేటర్లో ఎన్నో వందల సినిమాలు ప్రదర్శితం అయ్యాయి.దశాబ్దాల కాలం పాటు అభిమానులను కూడా బాగా అలరించింది బృందా థియేటర్( Brinda Theatre ).కొత్త కొత్త సినిమాలను కూడా ప్రదర్శిస్తూ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసింది.అలాంటి ఈ బృందా థియేటర్ ఇప్పుడు కనుమరుగు కానుంది.

ఇప్పటికే ఈ థియేటర్లలో సినిమాలను ప్రదర్శించడం ఆపేసిన విషయం తెలిసిందే.గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గింది.

దీనికి ప్రతిగా తమిళనాడు( Tamil Nadu ) వ్యాప్తంగా ఐకానిక్‌ థియేటర్ లను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చైన్నెలో పాపులర్‌ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణి లాంటి ఎన్నో థియేటర్లు నేలమట్టం అయిన విషయం కూడా తెలిసిందే.ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌ మార్క్‌ గా నిలిచిన పెరంబూర్‌ బృందా థియేటర్‌ చరిత్ర సోమవారంతో ముగిసింది.1985 ఏప్రిల్‌ 14న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేతుల మీదుగా బృందా థియేటర్‌ ని ప్రారంభించారు.అప్పుడు లోగనాథన్‌ చెట్టియార్‌ దాని యజమాని.

Advertisement

అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్‌, చంద్రశేఖర్‌ దీనిని కొనసాగించారు.ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు.

ఈ థియేటర్‌ ను కూల్చివేయనున్నారు.ఒక ప్రైవేట్‌ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు.అయితే దాదాపుగా 40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్‌ పన్నీర్‌ సెల్వం మాట్లాడుతూ.

మా థియేటర్‌ కి బృందా థియేటర్‌ అని పేరు పెట్టినా రజనీ థియేటర్‌ అని పిలుస్తారు.రజనీ కాంత్ ఈ థియేటర్‌ ని ప్రారంభించారు.రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని అని ఆయన చెప్పుకొచ్చారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు