టాలీవుడ్ లో మహేష్ బాబు సంచలన రికార్డ్.. బ్రేక్ చేయడం ఏ హీరోకైనా కష్టమేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు మహేష్ బాబు.

కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తున్నారు మహేష్ బాబు.అటు పాన్ ఇండియా సినిమా అవకాశాలు ఇటు హిందీ సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలలో మాత్రం నటించలేదు.

అందుకు కట్టుబడి సినిమాలు చేసి సూపర్ స్టార్ గా అవతరించారు.అయితే అలా అని రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శక ధీరులు ఊరుకోరుగా, అందుకే ఇప్పుడు పాన్ ఇండియా వద్దులే పాన్ వరల్డ్ చేద్దామంటూ మహేష్ బాబును గట్టిగా పిండేయబోతున్నారు.

రాజమౌళితో సినిమా అంటే కఠినంగా ఉంటుంది.నియమ నిబంధనలు కూడా కచ్చితంగా అమలు పరచాలి.సినిమా పూర్తయ్యేసరికి మహేష్ బాబు పరిస్థితిని ఊహించుకుంటేనే నవ్వొస్తోంది.

Advertisement

ఎంత లేదన్న కనీసం సినిమా విడుదల అవ్వడానికి మూడేళ్లు సమయం పడుతుంది.ఎన్ని సినిమాలు చేస్తున్నా ఏ సినిమాలో విభిన్నంగా ఉండటానికి ప్రయత్నించకుండా ఒకే తరహాలు కనిపిస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.

అందుకే రాజమౌళి మహేష్ బాబును పూర్తిగా మార్చేస్తున్నారు.టాప్ స్టార్ గా అవతరించిన ప్రిన్స్ గత ఐదు సినిమాల ద్వారా తెలుగు హీరోలెవరికీ సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నారు.

భరత్ అనే నేను సినిమా( Bharat Ane Nenu movie ) ద్వారా రూ.101 కోట్ల షేర్ రాబట్టారు.ఆ తర్వాత చేసిన మహర్షి సినిమా ( Maharshi movie )ద్వారా రూ.105 కోట్ల షేర్ వచ్చింది.మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాకు రూ.139 కోట్ల షేర్, సర్కారువారి పాట సినిమాకు రూ.111 కోట్ల షేర్, గుంటూరు కారం సినిమా ద్వారా రూ.112 కోట్ల షేర్ వచ్చింది.ఇలా వరుసగా ఐదు సినిమాలకు కలిపి రూ.567 కోట్ల షేర్ రాబట్టి సంచలన రికార్డును నెలకొల్పారు మహేష్ బాబు.అయితే భరత్ అనే నేను, మహర్షి కాకుండా చివరి మూడు సినిమాలు మహేష్ బాబు స్థాయి సినిమాలు కాకపోయినా, ఆ సమయంలో అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేకపోవడంతో కొత్త దర్శకులతోనే సినిమాలు చేసి తనకున్న క్రేజ్ ద్వారా వాటిని సూపర్ హిట్లుగా మలిచారు.

సర్కారువారి పాట యావరేజ్, గుంటూరు కారం ఫ్లాప్.అయినా వాటికి కూడా షేర్ వచ్చిందంటే మహేష్ బాబు క్రేజ్ తెలుగులో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తెలుగులో మరే హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు.

ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?

ఇదంతా నాన్ బాహుబలి కేటగిరిలోనే.రాజమౌళితో చేస్తున్న సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల గ్రాస్ వసూళ్లు ఉంటాయో, ఎన్ని వందల కోట్ల షేర్ వస్తుందో చూడాలి మరీ.

Advertisement

తాజా వార్తలు