ముడ‌త‌లను పోగొట్టి ముఖాన్ని స్మూత్‌గా మార్చే సూప‌ర్ ప్యాక్ మీకోసం!

వ‌య‌సు పైబ‌డే కొద్ది చర్మం సాగి ముడ‌త‌లు ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చిన్న వ‌య‌సులోనే చాలా మంది ముడ‌త‌ల స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, హార్మోన్ ఛేంజ‌స్‌, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే చ‌ర్మ ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం, ఊబ‌కాయం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే చ‌ర్మంపై ముడ‌త‌లు ఏర్పడుతుంటాయి.ఈ ముడ‌త‌లు చ‌ర్మ సౌంద‌ర్యాన్నే కాదు మ‌న‌లోని మ‌నోధైర్యాన్ని సైతం దెబ్బ తీస్తాయి.

The Super Pack That Removes Wrinkles And Makes The Face Smooth Is For You! Wrink

దాంతో చ‌ర్మంపై ప‌డ్డ ముడ‌త‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఫేస్ ప్యాక్‌ను ట్రై చేస్తే ముడ‌త‌లు పోవ‌డ‌మే కాదు ముఖం స్మూత్‌గా, గ్లోయింగ్‌గా కూడా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకుని ఒక‌టికి రెండు సార్లు నీటితో క‌డ‌గాలి.

Advertisement

ఆ త‌ర్వాత అర క‌ప్పు వాట‌ర్ పోసి నాలుగైదు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న బియ్యం, కొన్ని అర‌టి పండు స్లైసెస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల‌ రోజ్ వాట‌ర్, వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

ఆపై వాట‌ర్ తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ ఫేస్ ప్యాక్‌ను రెండు రోజుల‌కు ఒక‌సారి వేసుకుంటే ముడ‌త‌లు క్ర‌మంగా త‌గ్గిపోయి ముఖం స్మూత్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు