రెండవసారి కలిసి నటిస్తున్న సూపర్ హిట్ జోడీలు ఇవే!

ఒకప్పుడు స్టార్ హీరోలంతా హీరోయిన్ లను రిపీట్ చేస్తూ ఉండేవారు.అప్పట్లో హీరోలు ఒకే హీరోయిన్ తో అరడజనకు పైగానే సినిమాలు చేసిన వారు ఉన్నారు.

అప్పుడు అలా ఒకే హీరోయిన్ తో అన్ని సినిమాలు చేసిన కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టేది కాదు.కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.

ఇప్పుడు హీరోయిన్ లు ఎక్కువ అయ్యారు.రోజుకొక హీరోయిన్ పుట్టుకొస్తూ ఉండడంతో హీరో ఒకే హీరోయిన్ తో సినిమాలు చేయడం లేదు.

సినిమా సినిమాకు కొత్త హీరోయిన్ దర్శనం ఇస్తున్నారు.స్టార్ హీరోయిన్స్ మాత్రమే రిపీట్ అవుతున్నారు తప్ప మిగతా హీరోయిన్స్ మాత్రం రిపీట్ అవ్వడం అరుదుగా జరుగుతుంది.

Advertisement

మరి ఇప్పుడు చాలా మంది హీరోలు హీరోయిన్ లను రిపీట్ చేస్తున్నారు.ఎవరెవరు ఏ ఏ హీరోయిన్ లను రిపీట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు - పూజా హెగ్డే :

వీరిద్దరూ కలిసి మహర్షి సినిమాలో నటించారు.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వీరి జోడీ కూడా సూపర్ హిట్ అనిపించు కుంది.

దీంతో మరోసారి ఈ జోడీ తెరమీద కనిపించడానికి రెడీ అవుతుంది.వీరిద్దరు త్రివిక్రమ్ సినిమాలో కలిసి నటించ బోతున్నారు.

చిరంజీవి - తమన్నా :

చిరు, తమన్నా జోడీ సైరా నరసింహారెడ్డి లో కనిపించారు.ఇక ఇప్పుడు మరోసారి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

నాని - కీర్తి సురేష్ :

నేను లోకల్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడీ ఇప్పుడు మరోసారి దసరా సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నారు.

Advertisement

రామ్ చరణ్ - కియారా అద్వానీ :

వినయ విధేయ రామ సినిమాలో ఈ జంట కలిసి నటించారు.ఈ సినిమా హిట్ అవ్వకపోయిన మరోసారి ఈ జోడీ తెరమీద కనిపించ బోతున్నారు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ15 లో ఈ జోడీ మెరవనుంది.

విజయ్ దేవరకొండ - సమంత :

వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో కాసేపు కనిపించి అలరించారు.అయితే ఇప్పుడు ఖుషీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నాగ చైతన్య - రాశీ ఖన్నా :

వీరిద్దరూ జోడీగా వెంకీ మామ సినిమాలో నటించారు.ఇక ఇప్పుడు థాంక్యూ సినిమాలో కలిసి నటించారు.త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజా వార్తలు