మొండి మచ్చలు ఎంతకు తగ్గట్లేదా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

ఎలాంటి మచ్చలు లేకుండా ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.

కానీ మొటిమలు, వయసు పైబ‌డటం, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడుతుంటాయి.

అవి సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.పైగా ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఆ మచ్చలు పోనే పోవు.

ఇటువంటి మొండి మచ్చలతో మీరు కూడా విసిగిపోయారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మచ్చలు అయినా దెబ్బకు పరార్ అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కీర దోసకాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తరుముకోవాలి.

Advertisement
Super Effective Remedy For Removing Stubborn Spots! Stubborn Spots, Stubborn Spo

ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చ సొన వేసుకోవాలి.

Super Effective Remedy For Removing Stubborn Spots Stubborn Spots, Stubborn Spo

అలాగే మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ జ్యూస్ ( Cucumber )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకుని.

ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మచ్చలు అయినా సరే కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.

Super Effective Remedy For Removing Stubborn Spots Stubborn Spots, Stubborn Spo
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటిస్తే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

Advertisement

సాగిన చర్మం టైట్ గా మారుతుంది.యవ్వనంగా మెరుస్తుంది.

పిగ్మెంటేషన్ సమస్య( Pigmentation problem )ను నివారించడానికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోండి.

తాజా వార్తలు