నెక్ డార్క్‌నెస్ ను పోగొట్టే సూప‌ర్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కా ఇదే!

సాధార‌ణంగా చాలా మంది ముఖంపై పెట్టే శ్ర‌ద్ధ మెడ‌పై పెట్ట‌రు.అందుకే కొంద‌రి ముఖం తెల్ల‌గా మెరిసిపోతుంటుంది.

కానీ, మెడ మాత్రం న‌ల్ల‌గా ఉంటుంది.దాంతో నెక్ డార్క్‌నెస్‌ను పోగొట్టుకోవ‌డం కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

మెడ‌పై వివిధ ప్ర‌యోగాలు చేస్తారు.అయిన‌ప్ప‌టికీ మెడ న‌లుపు పోకుంటే ఏం చేయాలో అర్థంగాక తీవ్రంగా మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కాను ట్రై చేస్తే సుల‌భంగా నెక్ డార్క్‌నెస్‌ను పోగొట్టుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌లు వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

అలా ఉడికిస్తే జెల్ త‌యారు అవుతుంది.ఆ జెల్‌ను ఒక ప‌ల్చ‌టి కాట‌న్ వ‌స్త్రం సాయంతో స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మ‌రో బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న అవిసె గింజ‌ల జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు క‌లుపుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని బ్రెష్ సాయంతో మెడ‌కు అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.బాగా డ్రై అయిన వెంట‌నే కొద్దిగా వాట‌ర్ జ‌ల్లి వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇప్పుడు మెడ‌పై త‌డి లేకుండా ట‌వ‌ల్‌తో తుడుచుకుని.ఏద‌మైనా మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక న‌లుపు పోయి మెడ తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.

Advertisement