నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!

గ్యాస్ సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్య( Digestive problem )ల్లో ఒకటి.

ముఖ్యంగా హెవీగా నాన్ వెజ్, బిర్యానీ, పులావ్, మసాలా వంటలను తీసుకున్నప్పుడు గ్యాస్ సమస్య మదన పెడుతూ ఉంటుంది.

అలాంటి సమయంలో చాలా మంది మందులు వేసుకుంటారు.లేదా టానిక్ తాగుతూ ఉంటారు.

వారానికి ఒకటి రెండు సార్లు వస్తే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు.కానీ కొందరు నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

దీని కారణంగా ఏం తినాలన్నా జంకుతుంటారు.పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉంటుంది.

Advertisement

ఇలా మీకు జరుగుతుందా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు అస్సలు మిస్ అవ్వకండి.

ఈ రెమెడీని పాటిస్తే గ్యాస్ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర, నాలుగు టేబుల్ స్పూన్లు వాము వేసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న జీలకర్ర, వాము( Cumin ) తో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఇంగువ( Asafoetida ), రెండు స్పూన్లు నల్ల ఉప్పు వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఇప్పుడు ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ లేదా పల్చటి మజ్జిగలో తయారు చేసుకున్న పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి తీసుకోవాలి.రోజుకు ఒక్కసారి ఈ విధంగా చేస్తే జీర్ణ వ్య‌వ‌స్థ పనితీరు మెరుగ్గా మారుతుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

గ్యాస్ సమస్య వేధించకుండా ఉంటుంది.సహజంగానే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడానికి పైన చెప్పుకున్న పొడి అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

ఈ పొడిని వాడటం స్టార్ట్ చేశారంటే గ్యాస్ అన్న మాటే అనరు.పైగా ఈ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

తాజా వార్తలు