వ్య‌ర్థాలను తొల‌గించి బాడీని హైడ్రేటెడ్‌గా మార్చే సూప‌ర్ డ్రింక్స్ మీకోసం!

శ‌రీరంలో వ్య‌ర్థాలు పెరిగిపోయే కొద్ది జ‌బ్బుల బారిన ప‌డే ప్ర‌మాదం పెరిగిపోతుంటుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ దెబ్బ తింటుంది.

శ‌రీర బ‌రువు కూడా అదుపు త‌ప్పుతుంది.అందుకే బాడీని ఎప్ప‌టిక‌ప్పుడు డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి.

శరీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలను తొల‌గించ‌డాన్నే డిటాక్స్ అంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ డ్రింక్స్‌ను తీసుకుంటే గ‌నుక వ్య‌ర్థాలు తొల‌గిపోవ‌డ‌మే కాదు బాడీ హైడ్రేటెడ్‌గా కూడా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ సూప‌ర్ డ్రింక్స్ ఏంటీ.? వాటిని ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే గుప్పెడు పుదీనా ఆకులు, దంచిన చిన్న అల్లం ముక్క‌, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి బాగా మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.ఇప్పుడు ఈ డ్రింక్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం క‌లిపి సేవించాలి.

ఇలా రోజూ ఉద‌యాన్నే చేస్తే గ‌నుక శ‌రీరంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి.మ‌రియు పుదీనాలో ఉండే ప్ర‌త్యేక సుగుణాల వ‌ల్ల శరీరం హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుంది.

అలాగే వాట‌ర్‌లో శుభ్రంగా క‌డిగిన ఓ కీర‌ను తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత బ్లెండ‌ర్‌లో క‌ట్ చేసి పెట్టుకున్న కీర ముక్క‌లు, కొన్ని పార్స్లీ ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం వేసి మెత్త‌గా గ్రౌండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మం నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకుని సేవించాలి.

ఇలా చేసినా కూడా పేరుకుపోయిన వ్య‌ర్థాలు తొల‌గిపోయి బాడీ హైడ్రేటెడ్‌గా మారుతుంది.అదే స‌మ‌యంలో వెయిట్ లాస్ అవుతారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి.గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.

Advertisement

మ‌రియు జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.

తాజా వార్తలు