వేస‌వి వేడిని త‌ట్టుకోలేక‌పోతున్నారా? అయితే ఈ సూప‌ర్ డ్రింక్ మీకే!

అప్పుడే చ‌లి కాలం పోయి వేస‌వి కాలం వ‌చ్చేసింది.గ‌త రెండు వారాల నుంచి ఎండ‌లు మండి పోతున్నాయి.

ఉద‌యం ప‌ది గంట‌లు దాటిందంటే చాలు ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఇంటి నుంచి బ‌య‌ట కాలు పెట్టేందుకే భ‌య‌ప‌డుతున్నారు.ఈ సీజ‌న్‌లో చాలా మంది వేస‌వి వేడిని త‌ట్టుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

త‌ల‌నొప్పి, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతుంటాయి.అయితే వీటి నుంచి ర‌క్షించి.

శ‌రీరాన్ని కూల్‌గా మార్చ‌డానికి ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్ సూప‌ర్‌గా స‌హాయ‌ ప‌డుతుంది.మ‌రి ఆ డ్రింక్ ఏంటీ.

Advertisement

ఎలా త‌యారు చేసుకోవాలి వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ స‌బ్జా గింజ‌లు వేసి వాట‌ర్ పోసి నాన‌ బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాట‌ర్‌, ఒక గ్లాస్ పాలు పోయాలి.ఇవి కాస్త హీట్ అయిన అనంత‌రం హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి, కొన్ని ఎర్ర గులాబీ రేకులు, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌టిక బెల్లం పొడి వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి త‌యారు చేసుకున్న డ్రింక్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని ఫిడ్జ్‌లో పెట్టుకోవాలి.కాసేప‌టి త‌ర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న డ్రింక్‌ను బ‌య‌ట‌కు తీసి ముందుగా నాన బెట్టిన స‌బ్జా గింజ‌ల‌ను క‌లిపి సేవించాలి.ఈ సూప‌ర్ అండ్ టేస్టీ డ్రింక్‌ను రోజుకు ఒక క‌ప్పు చొప్పున తాగితే వేస‌వి వేడిని త‌ట్టుకునే శ‌క్తి శ‌రీరానికి ల‌భిస్తుంది.

త‌ల‌నొప్పి, ఒత్తిడి, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.డీహైడ్రేష‌న్ బారిన ప‌డకుండా ఉంటారు.శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు సైతం ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement